ఐబీపీఎస్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన క్లర్క్ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెరిగింది. మొదట రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో 5,830 క్లర్క్ పోస్టుల్ని ప్రకటిస్తే, తాజా నోటిఫికేషన్ ద్వారా 7855 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ఐబీపీఎస్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 7855 క్లర్క్ పోస్టులున్నాయి.
ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 7న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు జూలై 12 నుంచి 14 మధ్య దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఖాళీల వివరాలు, విద్యార్హతలతో పాటు సవరించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
IBPS Clerk Recruitment 2021: రాష్ట్రాలవారీగా ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 7855 |
తెలంగాణ | 333 |
ఆంధ్రప్రదేశ్ | 387 |
అండమాన్ & నికోబార్ | 5 |
అరుణాచల్ ప్రదేశ్ | 13 |
అస్సాం | 191 |
బీహార్ | 300 |
చండీగఢ్ | 33 |
ఛత్తీస్‌గఢ్ | 111 |
దాద్రా నగర్ హవేలి అండ్ డయ్యూ డామన్ | 3 |
న్యూ ఢిల్లీ | 318 |
గోవా | 59 |
గుజరాత్ | 395 |
హర్యానా | 133 |
హిమాచల్ ప్రదేశ్ | 113 |
జమ్మూ అండ్ కాశ్మీర్ | 26 |
జార్ఖండ్ | 111 |
కర్ణాటక | 454 |
కేరళ | 194 |
లక్షద్వీప్ | 5 |
మధ్యప్రదేశ్ | 389 |
మహారాష్ట్ర | 882 |
మణిపూర్ | 6 |
మేఘాలయ | 9 |
మిజోరం | 4 |
నాగాలాండ్ | 13 |
ఒడిశా | 302 |
పుదుచ్చేరి | 30 |
పంజాబ్ | 402 |
రాజస్తాన్ | 142 |
సిక్కిం | 28 |
తమిళనాడు | 842 |
త్రిపుర | 8 |
ఉత్తరప్రదేశ్ | 1039 |
ఉత్తరాఖండ్ | 58 |
పశ్చిమ బెంగాల్ | 516 |
IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల | 2021 అక్టోబర్ 7 |
దరఖాస్తు ప్రారంభం | 2021 అక్టోబర్ 7 |
దరఖాస్తుకు చివరి తేదీ | 2021 అక్టోబర్ 27 |
దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ | 2021 అక్టోబర్ 27 |
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ | 2021 నవంబర్ |
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ | 2021 నవంబర్ |
ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ | 2021 నవంబర్ లేదా డిసెంబర్ |
ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ | 2021 డిసెంబర్ |
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల | 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి |
మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ | 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి |
మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ | 2022 జనవరి లేదా ఫిబ్రవరి |
ప్రొవిజినల్ అలాట్‌మెంట్ | 2022 ఏప్రిల్ |
IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడుదలయైన . ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్- XI (IBPS CRP-XI) పరీక్ష తెలుగులోనే రాయొచ్చు. ఈ పరీక్షకు అక్టోబర్ 7, 2021 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలైలో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచింది. తాజా ఉత్తర్వులతో తిరిగి ప్రారంభం కానుంది.
ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో దరఖాస్తు ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. నోటిఫికేషన్ (Notification) విడుదలైన సమయంలో అంటే జూలై 12 నుంచి 14వ తేదీల మధ్య రిజిస్టర్ చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
ఈ పరీక్షలే కాకుండా SSC, RRB, మరియు IBPS ద్వారా నిర్వహించే నియామక పరీక్షలతో సహా అనేక పోస్టులకు సాధారణ నియామక పరీక్షలను నిర్వహించే ఒక జాతీయ నియామక సంస్థ (NRA) ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సంవత్సరానికి రెండుసార్లు జరిగే అన్ని పోస్టులలో నియామకానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) ఉంటుంది. విద్యా అర్హతల ఆధారంగా ప్రతి ఒక్కరికి వేర్వేరు CET లు ఉంటాయి. CET 12 ప్రాంతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌లో కూడా నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ వివరాలు..
బ్యాంక్ జాబ్ కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ క్లర్క్ 11 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,830 క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ లో తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 263, తెలంగాణలో 263 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
తాజా తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ తిరిగి ప్రారంభ తేదీ | అక్టోబర్ 7, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 27, 2021 |
ప్రిలిమ్స్ ఎగ్జామ్ | డిసెంబర్, 2021 |
ప్రిలిమ్స్ ఫలితాలు | డిసెంబర్, 2021 / జనవరి, 2022 |
మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు | జనవరి, 2022 |
మెయిన్ ఎగ్జామ్ | జనవరి / ఫిబ్రవరి 2022 |
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ | ఏప్రిల్, 2022 |